ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో సికింద్రాబాద్ అల్వాల్‌లో ఓ మహిళ తన భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది. మచ్చబొల్లారం గోపాల్ నగర్‌లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను గొడ్డలితో నరికి హత్య చేసింది. మచ్చబొల్లారం గోపాల్ నగర్‌లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో శ్రీనివాస్, రమాదేవి దంపతులు నివాసముంటున్నారు. శ్రీనివాస్ వ్యాపారంలో నష్టపోవడంతో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా గొడవ జరగడంతో ఆవేశంలో భార్య రమాదేవి, భర్త శ్రీనివాస్‌పై గొడ్డలితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్య రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక సమస్యలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.












