లక్ష్మణచందా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
మండలంలోని బొరిగాం తండాలో ఆదివారం తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తండా వాసులు కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.
బొరిగాం తండాలో ఘనంగా తీజ్ ( మండలంలోని బొరిగాం తండాలో ఆదివారం తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తండా వాసులు కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. అనంతరం గోధుమ బుట్టలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాటిని ఊరేగింపుగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని వడ్డేపల్లి వాగుకు తీసుకెళ్లారు. అక్కడ గోధుమ బుట్టలను నిమజ్జనం చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది.కార్యక్రమంలో తండా నాయక్ సంతోష్, గ్రామ ఉపసర్పంచ్ వసంత్, జగదంబ ఆలయ పూజారి పద్మ, శక్కరం, రాజ్య, ప్రేమ్‌దాస్, గంగారాం నాయక్, గ్రామ పెద్దలు, తండా వాసులు పాల్గొన్నారు.











