సారంగాపూర్, 13 September
మండలంలోని కౌట్ల బి శాంతినగర్ గ్రామంలో గిరిజనులు అంగరంగ వైభవంగా తీజ్ పండుగను నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ గుడి వద్ద వేడుకలు ప్రారంభించి, సంప్రదాయ నృత్యాలతో వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
కౌట్ల బి గ్రామంలో తీజ్ పండుగ మండలంలో కౌట్ల బి శాంతినగర్ గ్రామంలో గిరిజనులు అంగరంగ వైభవంగా తీజ్ పండుగ నిర్వహించారు. తమ గ్రామంలో సేవాలాల్ మహారాజ్ గుడి వద్ద ఈ తీజ్ పండుగ వేడుకలను. ప్రారంభించి వీధి లలో సంప్రదాయ నృత్య లతో ప్రదర్శించారు. గత 9 రోజుల కిందట గోధుమలు చల్లిన నారును పెళ్లి కానీ ఆడపడుచులకు ఈ పండుగ ఒక ప్రత్యేకత. పాడి పంటలు బావుంటూ ఆడపిల్లలకు మంచి జరగాలన్న తలంపుతో వారు భోగుబండారు నిర్వహించి ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంతింగర్ తాండ గ్రామ నాయక్తో రాథోడ్ సీతారాం,కోరోబారి,దావూ,పూజారి దేవి దాస్, తేజు నాయక్ ,గంగాధర్, ప్రభాకర్ గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ఆడపిల్లలు పెద్ద మొత్తంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.











