వేపరల, ప్రొద్దుటూరు (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 13
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన ఒక వ్యక్తికి బంధువులు లేకపోవడంతో, మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులో మానవత్వాన్ని చాటింది.
*అయినవారు రాకున్నా.. మానవత్వంతో అంతిమ సంస్కారాలు - మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్* స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉప్పలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి అనారోగ్యం చేత మరణించగా ఆయన ఆధార్ లో వేపరల గ్రామానికి చెందిన వ్యక్తి అని ఉంది మృతదేహాన్ని మార్చురీ నందు ఉంచగా అంతిమ సంస్కరణలు చేయడానికి బందువులు ఎవరు ముందుకు రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఈరోజు హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, అశోక్,సతీష్,రసూల్ పాల్గొని అంత్యక్రియలను పూర్తి చేశారు.చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలని ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ, అవసరంలో ఉన్న వారిక అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన **ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..* 82972 53484, 9182244150.











