లోకేశ్వరం, 13 September
వినాయక చవితి పండుగ సందర్భంగా మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో, భక్తుల దాహార్తిని తీర్చేందుకు రమేష్‌గౌడ్ మినరల్ వాటర్ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సరఫరా కొనసాగుతోంది. అన్నదానం జరిగే ప్రతి చోట స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందిస్తున్నారు.
వినాయక మండపాలకు.. ఉచిత మినరల్ వాటర్ భక్తుల దాహం తీర్చడమే లక్ష్యం రమేష్‌గౌడ్ సేవలకు మండలవాసుల ప్రశంసలు అన్నదాన కార్యక్రమాల వద్ద ఉచితంగా నీటి సరఫరా , సెప్టెంబరు 13 ( వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని వినాయక మండపాల వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమాలకు రమేష్‌గౌడ్ మినరల్ వాటర్ ఆధ్వర్యంలో ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అన్నదానం జరిగే ప్రతి చోట భక్తులకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందిస్తూ సేవా స్ఫూర్తిని చాటుతున్నారు. ఉచితంగా మంచినీరు అందించడాన్ని సేవగా భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రమేష్‌గౌడ్ తెలిపారు. వినాయక మండపాల వద్ద భక్తులు, యువకులు, నిర్వాహకులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మేరకు మినరల్ వాటర్‌ను ఉచితంగా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పండుగ వేళ భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా తాగునీరు అందించడం అభినందనీయమని మండలవాసులు కొనియాడారు. వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి రమేష్‌గౌడ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని యువకులు, భక్తులు ప్రశంసించారు.











