మామడ లో రాత్రివేళ భూ రిజిస్ట్రేషన్‌పై ఆరోపణలు లీగల్ నోటీసు ఇచ్చినా పట్టించుకోలేదని రైతు మండలంలో వివాదాస్పద భూమి రిజిస్ట్రేషన్‌పై ఓ రైతు చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయవద్దంటూ ముందుగానే లీగల్ నోటీసు ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదని సారంగాపూర్‌కు చెందిన రైతు కొప్పుల నరేష్ ఆరోపించారు. సారంగాపూర్ గ్రామానికి చెందిన నరేష్‌కు సర్వే నంబర్లు 103/1, 103/2, 103/3, 104తో పాటు వాటి ఉప విభాగాల్లో భూములు ఉన్నాయని తెలిపారు. ఆయా భూముల హద్దులు, 16 అడుగుల దారి, నాలా, డ్రైనేజీ, అటవీ సరిహద్దులకు సంబంధించి వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు. వివాదం పరిష్కారమయ్యే వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేపట్టవద్దని కోరుతూ న తహసీల్దార్‌కు లిఖితపూర్వక అభ్యంతరం, లీగల్ నోటీసు అందజేసినట్లు తెలిపారు.అయితే సర్వే నంబర్ 103/3/1/1లోని 20 గుంటల భూమిని సెప్టెంబరు 5న సాయంత్రం 6.30 గంటలకు రిజిస్ట్రేషన్ చేసినట్లు నరేష్ ఆరోపించారు. సాధారణ కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రజావాణి/గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తహసీల్దార్‌పై మరిన్ని ఆరోపణలు తహసీల్దార్‌పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తాండ్రా గ్రామంలోని సర్వే నంబర్ 113/2లోని అసైన్డ్ భూమికి సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అలాగే భూముల రికార్డుల మార్పులు, దారి, నాలా, డ్రైనేజీ, అటవీ సరిహద్దులకు సంబంధించిన అంశాల్లోనూ అక్రమాలకు సహకరిస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గు తేల్చాలని బాధితులు కోరుతున్నారు. అధికారుల ఫోన్ కాల్ వివరాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తే అక్రమాల వెనుక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ దృష్టికి ఫిర్యాదు ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత తహసీల్దార్‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. తహసీల్దార్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, తప్పులు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
మామడ లో రాత్రివేళ భూ రిజిస్ట్రేషన్‌పై ఆరోపణలు
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- సారంగాపూర్ గ్రామానికి చెందిన నరేష్‌కు సర్వే నంబర్లు 103/1, 103/2, 103/3, 104తో పాటు వాటి ఉప విభాగాల్లో భూములు ఉన్నాయని తెలిపారు.
- ఆయా భూముల హద్దులు, 16 అడుగుల దారి, నాలా, డ్రైనేజీ, అటవీ సరిహద్దులకు సంబంధించి వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు.
- తాండ్రా గ్రామంలోని సర్వే నంబర్ 113/2లోని అసైన్డ్ భూమికి సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3360ఆర్టికల్స్
4,25,958వ్యూస్