ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19న ఉత్తర అండమాన్ లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 19వ తేదీన ఉత్తర అండమాన్ లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.












