మండలంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. 33/11 కేవీ , కొరిటికల్, పరిమండల్, మేడిపల్లి, తాండ్ర ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.
నిర్వహణ పనులు
నెలవారీ నిర్వహణ పనుల్లో భాగంగా 33 కేవీ విద్యుత్ మార్గంలో చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ల మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని కోరారు.












