నిర్మల్, 7 September
రానున్న వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా పాల్గొన్నారు.
వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ రానున్న వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రానున్న వినాయక ఉత్సవాల నిర్వహణపై పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మతాల పండుగలు సహోదర భావంతో, కలిసి మెలసి జరుపుకోవాలన్నారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గణేష్ ఉత్సవాలు మొత్తం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వైర్లను సరి చేస్తామని చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తమ వంతుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. అలాగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసి శోభాయాత్రకు అనుకూలంగా మారుస్తామని వివరించారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు వినాయక ఉత్సవాలు శాంతియుతంగా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటాం:* జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ సమావేశంలో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, జిల్లాలో గణేష్ ఉత్సవాలు మొత్తం ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖ తరుపున తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వేడుకలకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంబంధిత అధికార యంత్రాంగంతో పోలీసు శాఖ సమన్వయంతో పని చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేలా చూస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, శాంతి కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












