మమడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
నిర్మల్ జిల్లా మండలంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ () కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. దీంతో క్షేత్రస్థాయి అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తుంటే ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై తలుపులు మూసుకుంటున్నారని సిబ్బంది వాపోతున్నారు.
*SIR కి సహకరించని జనం.. తిప్పలు పడుతున్న అధికారులు..!* *సొంత పనుల్లో బిజీగా ప్రజలు - రాత్రింబవళ్లు SIR ఆన్లైన్ చేస్తున్న సిబ్బంది* * , నిర్మల్ జిల్లా:* కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *Special Intensive Revision (SIR)* కార్యక్రమానికి మండలంలో ప్రజల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల జాబితా సవరణలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి SIR నోటీసులు అందజేసి, వివరాలు సేకరించాలని అధికారులు ప్రయత్నిస్తుంటే, ప్రజలు మాత్రం తమ సొంత పనుల్లో, వ్యవసాయ పనుల్లో నిమగ్నమై తలుపులు వేసుకుంటున్నారని సిబ్బంది వాపోతున్నారు. *సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఫలితం శూన్యం..* SIR నోటీసులు తప్పనిసరిగా తీసుకోవాలని, ఆధార్, ఓటర్ కార్డు, కుటుంబ వివరాలు ఇవ్వాలని అధికారులు వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా స్పందన కరువైందని అంటున్నారు. "పగలంతా పొలం పనులు, సాయంత్రం ఇంటికి వస్తే అధికారులు రావడం లేదు, మేము ఇంట్లో ఉంటే అధికారులు రావడం లేదు" అంటూ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. *రాత్రింబవళ్లు ఆన్లైన్లో..* మరోవైపు పైఅధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో BLO లు, GPO లు, రాత్రింబవళ్లు SIR డేటాను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పగలు ఫీల్డ్ వర్క్, రాత్రి ఆన్లైన్ ఎంట్రీతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గడువులోగా SIR పూర్తి చేయకపోతే మెమోలు, సస్పెన్షన్లు తప్పవన్న భయంతో అధికారులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించి, తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు SIR కు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.












