15వ వార్డు, బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
బోథ్ గ్రామ పంచాయతీ పరిధిలోని 15వ వార్డులో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక వార్డు సభ్యులు - అధికారి శ్రీ చవాన్ జైవంత్ గారికి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ లేకపోవడంతో మంచినీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోందని వారు తెలిపారు.
బోథ్ 15వ వార్డులో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి* NPDCL CGRF-II అధికారికి వినతిపత్రం అందజేసిన వార్డు సభ్యులు* బోథ్ గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక *15వ వార్డులో కరెంట్ స్థంభాలు, విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.* ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి, వార్డు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వార్డు సభ్యులు తెలిపారు. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లుతూ *NPDCL CGRF-II అధికారి శ్రీ చవాన్ జైవంత్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.* 15వ వార్డులో అవసరమైన విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. వినతిపత్రంపై *శ్రీ చవాన్ జైవంత్ గారు సానుకూలంగా స్పందించి, సమస్య తీవ్రతను గుర్తించి అతి త్వరలో సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.* *షేక్ షాకీర్* *వార్డు సభ్యులు, 15వ వార్డు* *బోథ్ గ్రామ పంచాయతీ*








