మండలం జడ్పీహెచ్ఎస్ తుంగపాడులో నియోజకవర్గస్థాయి పాఠశాలల క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధీరావత్ మంగళ, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బెడదూరి వెంకటరెడ్డి ఈ క్రీడలను ప్రారంభించారు.
నియోజకవర్గంలోని దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి, మండలాల నుండి సుమారు 400 మంది క్రీడాకారులు కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడల కోసం తరలివచ్చారు. వీరంతా ఆకర్షణీయంగా మార్చ్‌పాస్ట్ నిర్వహించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ధీరావత్ మంగళ మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. స్థానిక సర్పంచ్ బెడదూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తుంగపాడు గ్రామంలో గత 30 ఏళ్లలో క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే ప్రథమమని తెలిపారు. పాఠశాలకు ఈ అవకాశాన్ని కల్పించిన స్కూల్ గేమ్స్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రీడోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ అనుముల యుగంధర్ రెడ్డి, వాయుము ఉపాధ్యాయులు పంగ సైదులు, మనోహర్, శోభారాణి, వెంకటరత్నం, షహీద్ అరుణ, వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, అనిల్, రాంరెడ్డితో పాటు గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












