తెలంగాణ, 8 September
దళితుడైన అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీఆర్ఎస్ నేతలకు దళితులంటే చిన్నచూపు ఉందని కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్మెంట్ నాయకులు కూడేల్లి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
*బీఆర్ఎస్ నేతలకు దళితులంటే చిన్నచూపు* *కూడేల్లి ప్రవీణ్ కుమార్* *కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్మెంట్ - నాయకులు* స్పీకర్‌ను అవమానించేలా తాతా మధు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ నేతలకు దళితులంటే చిన్నచూపు ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడేల్లి ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. దళితుడైన అసెంబ్లీ స్పీకర్‌ను అవమానించే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు. తాతా మధు వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. దళితుడైన వ్యక్తిని “స్పీకర్ సర్” అని సంబోధించాల్సి వస్తుందనే భావనతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కూడేల్లి ప్రవీణ్ కుమార్ విమర్శించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహించి, ప్రజలకు మరియు స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, దళితుల గౌరవం మరియు రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.












