ఫరూక్ నగర్, షాద్ నగర్, రంగారెడ్డి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు ప్రతిపాదనలను ఖండిస్తూ, చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారనే భావనతో షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలాలకు చెందిన ఉప సర్పంచుల అధ్యక్షులు మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి, ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్ లను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.
*ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఎం. గోవర్ధన్ రెడ్డి, ఎం. ప్రకాష్ గౌడ్ ల అరెస్ట్* *చలో అసెంబ్లీ పిలుపుతో ముందస్తు అరెస్టు* *నిరసన తెలిపే హక్కు కాలరాయడం తప్పు* ఉప సర్పంచ్ల 'చెక్ పవర్ రద్దు' ప్రతిపాదనలను ఖండిస్తూ, ఉపసర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ పిలుపు మేరకు చేపట్టిన "చలో అసెంబ్లీ" ముట్టడి కార్యక్రమం ఉందని భావించిన నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గ ఉప సర్పంచుల అధ్యక్షులు మల్కయ్య గారి గోవర్ధన్ రెడ్డి, ఫరూక్ నగర్ మండల ఉపసర్పంచ్ ల అధ్యక్షులు ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్ లను మరియు వివిధ గ్రామాల ఉపసర్పంచులను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భంగపరచే ఉద్దేశంతోనే పోలీసులు ఈ ముందస్తు అరెస్టులకు పాల్పడ్డారని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, చేసుకొని ఎడల ఉప సర్పంచులు నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితులు వస్తాయి అని తెలియజేశారు ,అలాగే అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు..












