లోకేశ్వరం, 10 September
అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలం కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కలిసి సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ ఏఈతో మాట్లాడి లాగ్ బుక్‌ను పరిశీలించారు.
అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఈరోజు మండలం కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తలు రైతుల తో కలిసి సబ్ స్టేషన్ ని ముట్టడించారు,ముధోల్ నియోజకవర్గ బిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు,మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ ఏ.ఈ తో మాట్లాడి లాగ్ బుక్ ను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కరెంటు సరఫరా ఈయకపోతే ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు నిరసన తెలుపుతూ ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్,మాజీ ఎంపీపీ సాగర్,మాజీ PACS చైర్మన్ చిన్నారావు సర్పంచ్ వెంకటేష్,మాజీ వైస్ ఎంపీపీ సాయన్న,ఉప సర్పంచ్ కడారి రాజు,BRS పార్టీ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్,BRS నాయకులు గడ్డం శ్రీనివాస్ రావు,పాల గంగాధర్ ప్రవీణ్,సందీప్, ఆర్ష ముత్యం,సంజీవ్, దినకర్, చిన్న బోజా రెడ్డి, సంటి రాజన్న,సంటి రాజన్న తదితరులు పాల్గొన్నారు












