నిజామాబాద్, 10 September
ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో హైదరాబాద్ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించి, ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమంలో పాల్గొంటామని తెలిపారు.
ఉద్యోగుల ‘చలో హైదరాబాద్’కు జనసేన మద్దతు పెండింగ్లో ఉన్న పీఆర్సీ, ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలి : ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేపట్టిన ‘చలో హైదరాబాద్’ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జిల్లా జనసేన నాయకుడు గుండా సంతోష్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులను మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గుండా సంతోష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీని ప్రకటించడంతో పాటు, ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 10న హైదరాబాద్లో జరిగే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమంలో ఉద్యోగులతో జిల్లాకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూరాహుల్, ధనుంజయ్ ప్రసాద్, జానీ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.












