బేగంబజార్, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి బేగంబజార్ కేంద్ర మండల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శల పరిధిని దాటి వ్యక్తిగతంగా అవమానించేలా ఉన్నాయని మల్లు రవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులకు విజ్ఞప్తి
ప్రజా జీవితంలో ఉన్న రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. సంబంధిత దృశ్యాలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన సమాచారంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను భద్రపరచాలని ఆయన పోలీసులను కోరారు.
వర్తించే చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి కేటీఆర్‌పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యల విషయంలో చట్టపరమైన హద్దులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని మల్లు రవి పేర్కొన్నారు.