బాపట్ల, 9 September
నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిజం గెలిచింది నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిజం గెలిచింది నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేసి, అర్ధరాత్రి అరెస్టు చేసి, 53 రోజులపాటు జైలులో నిర్బంధించారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












