ఖానాపూర్, 9 September
ఖానాపూర్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమి సురేష్ తండ్రి పరిమి భీమరాజం ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ ఆయన నివాసానికి వెళ్లి, సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఖానాపూర్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమి సురేష్ తండ్రి పరిమి భీమరాజం ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ ఆయన నివాసానికి వెళ్లి, సురేష్ కుటుంబాన్ని పరామర్శించి, సభ్యులను ఓదార్చారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పి, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.












