బాసర, 10 September
తెలంగాణ వీరవనిత, సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికే ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మమ్మాయి రమేష్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం బాసరలోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికే ఆదర్శం బాసర, సెప్టెంబరు 10 తెలంగాణ వీరవనిత, సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ సమాజానికే ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మమ్మాయి రమేష్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం బాసరలోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మమ్మాయి రమేష్ పాల్గొని ఐలమ్మను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దొరల గడీలను ఎదిరించి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు. ఆమె చూపిన తెగువ, ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరావు దేశ్ముఖ్, పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్ దేశ్ముఖ్, జలీల్, జంగం రాజేందర్, నాగరాజు, శ్రీను పటేల్, శంకర్, అశోక్, ఆస్టం దేవన్న, భోజన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.












