నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడిగా హస్గుల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రకాష్ జెటేకర్ నియమితులయ్యారు. ఈ నియామకం సందర్భంగా భైంసాలో ఆయనను మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పాటిల్ సన్మానించారు.
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడిగా హస్గుల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రకాష్ జెటేకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భైంసా పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పాటిల్ నివాసంలో శుక్రవారం ప్రకాష్ జెటేకర్ను శాలువాతో సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పాటిల్ మాట్లాడుతూ, ప్రకాష్ జెటేకర్ కి అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రకాష్ జెటేకర్ మాట్లాడుతూ, తనను జిల్లా ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడిగా నియమించిన అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, భోస్లే నారాయణరావు పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కోసం అహర్నిశలు పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్ చంద్రే, భైంసా పట్టణ అధ్యక్షుడు కె. అరవింద్, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు భోజరం పటేల్, నారాయణరెడ్డి, జాడే శ్రీనివాస్‌తో పాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.












