మాజీ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్‌రావు 72 వసంతాలు పూర్తి చేసుకుని 73వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కిషన్, పూజారులు విఠల్‌రావును శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం లక్ష్మీప్రియనగర్లో కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బి. రమణారావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో విఠల్‌రావు పుట్టినరోజు వేడుకలను అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విఠల్‌రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరుడు నాగుల క్రాంతి ద్వారా లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లు విఠల్‌రావు పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో తన అనుబంధం ఇలాగే కొనసాగాలని విఠల్‌రావు కోరుకున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, కేటీఆర్ ఉన్నత పదవులు చేపట్టాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ, మరియు ప్రొఫెసర్ జీ. విద్యాసాగర్‌ల జన్మదిన వేడుకలు కావడం విశేషం. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి రోజునే దాదాన్నగారి విఠల్‌రావు జన్మదినం కావడం విశేషమని పేర్కొన్నారు.












