బైంసా పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగు గంగారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నాగేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా గంగారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, మృతికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












