సారంగాపూర్ మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పరామర్శించారు. వారిని ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు.
సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పర్యటించి, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చించోలి (బి) గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను, కు చెందిన నర్సగౌడ్ కుటుంబ సభ్యులను, స్వర్ణ గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబ సభ్యులను, దుప్య తండాకు చెందిన మాజీ సర్పంచ్ ప్రహ్లాద్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యుల పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు మాధవరావు, పీఎస్హెచ్ చైర్మన్ నారాయణ రెడ్డి, మాజీ జెడ్ఆర్ఎస్ఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ భూమన్న, చించొలి బి సర్పంచ్ సాయన్న, పోట్య సర్పంచ్ కైలాస్ రాంసింగ్, తండా సర్పంచ్ గవస్కర్, డూప్యాతండా సర్పంచ్ గోపాల్, వినయ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












