నిర్మల్ పట్టణంలోని మంజులపూర్ లోగల వృద్ధాశ్రమంలో మంగళవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేత పతాని నర్సయ్య ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులు నిండు నూరేళ్లు జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రావుల రామనాథ్, మంతెన గంగారెడ్డి, కాల్వ నరేష్, అంబాజీ నాయక్, కంకట శ్రావణ్, సాహెబ్ రావు, బడిపోతన్న, ఎల్లన్న, సాగర్ రెడ్డి, కొప్పుల నరసయ్య, మధు, రంజిత్ పాల్గొన్నారు.












