హైదరాబాద్ లకిడికపూల్లోని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో దామరచర్ల మండలం దిలావర్పూర్ గ్రామ సర్పంచ్ బెజ్జం సాయిను నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నియమించారు.తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపులసత్యనారాయణ రెడ్డి బెజ్జం సాయికి నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవిలను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని,సర్పంచులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంబంధితఅధికారులతో సమన్వయం చేసుకుంటూసమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలనిసూచించారు.నూతనంగా నియమితులైన నాయకులు మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని సర్పంచుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం సంఘం తరఫునసమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలనుసంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయి మాట్లాడుతూ
నల్లగొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా తనను నియమించిన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, తనపై విశ్వాసం ఉంచి మద్దతు తెలిపిన నల్లగొండ జిల్లా సర్పంచులందరికీ బెజ్జం సాయి కృతజ్ఞతలు తెలిపారు.












