మామడ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బత్తుల రంజిత్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు లక్ష్మి, ఉపసర్పంచ్ ప్రవీణ్, సీనియర్ నాయకులు బాపురెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎల్వీ రమణ, పందిరి సురేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.












