ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర రీజియన్ కార్యకర్తల సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నారు. ఉత్తరాంధ్రలోని జిల్లాల ముఖ్య నేతలతో నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై చర్చించారు.
మజ్జి శ్రీను పార్టీ వీడిన నేపథ్యంలో విజయనగరంలో పార్టీ పరిస్థితి, శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం కుమారుడి వ్యాఖ్యలపై ఆరా తీశారు. పార్టీ వీడిన వారి స్థానంలో తొలి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, కేడర్‌కు మద్దతుగా నిలవాలని సూచించారు. భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశంపై ఒకటి రెండు రోజుల్లో కొత్త ఇన్ఛార్జ్ను ఖరారు చేస్తానని జగన్ చెప్పినట్లు సమాచారం.












