ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ ప్రారంభంలో తొలి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని పట్టణ స్థానిక సంస్థలకు () సంబంధించి వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం () మొదటి విడతలో పురపాలక (మున్సిపల్) ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత గ్రామీణ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలను చేపట్టాలని కసరత్తు చేస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి
స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్నట్లు విశాఖ జడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి తెలిపారు. 652 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 2,342 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో రాజకుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.












