ముధోల్, 18 September
నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కలలుగన్న 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, నిధులు ఇవ్వాలని పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కలలుగన్న 28 ప్యాకేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, నిధులు ఇవ్వాలని పలుమార్లు అసెంబ్లీలో విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కోసం తమ నియోజకవర్గ రైతులు ఎంతో భూమిని కోల్పోయారని, అయినప్పటికీ ముధోల్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. 28 ప్యాకేజీకి 500 కోట్ల రూపాయల నిధులు ఇస్తే అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ పనులు పూర్తయి, రైతులకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 80 కోట్ల నిధులు వెచ్చించి పనులు పూర్తి చేసినా, ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ సరఫరాకు 2 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు అవసరమని, తక్షణం నిధులు విడుదల చేస్తే 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు.












