సదాశివపేట, 15 September
నిజాం రాజరిక వ్యవస్థను, జాగీర్దారులు, రజాకారుల దురాగతాలను ఎదురించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపి వేలాది గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని జిల్లా కార్యదర్శి, జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య అన్నారు. షాద్‌నగర్ లో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
*నిజాం రాజరికాన్ని కూలదోసిన వీరులు కమ్యూనిస్టులే* * జిల్లా కార్యదర్శి, జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య* *పదివేల గ్రామాలను విముక్తి చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం* *తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా షాద్‌నగర్ లో సభ* నిజాం రాజరిక వ్యవస్థను, జాగీర్దారులు, రజాకారుల దురాగతాలను ఎదురించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపి వేలాది గ్రామాలను విముక్తి చేసిన ఘనత కమ్యూనిస్టులదేనని జిల్లా కార్యదర్శి, జాతీయ సమితి సభ్యుడు పాలమాకుల జంగయ్య అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో షాద్‌నగర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, రాజరిక వ్యవస్థను కూలదోసేందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. రజాకారుల దుర్మార్గాలు, జాగీర్దారుల దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరిస్తూ కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలిచారని అన్నారు. ప్రజల విముక్తి కోసం పోరాడిన క్రమంలో సుమారు నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోధులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటమని, దాని చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జంగయ్య విమర్శించారు. సాయుధ పోరాటాన్ని కేవలం హిందూ-ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు. భూస్వామ్య, జాగీర్దారీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, పేద ప్రజలను సమీకరించి కమ్యూనిస్టులు పోరాటం సాగించారని తెలిపారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులు ప్రజల తరఫున నిలబడి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని జంగయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యుడు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పానుగంటి పర్వతాలు, రాష్ట్ర సమితి సభ్యుడు, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు, సర్పంచ్ ఎం. శ్రీను, సీనియర్ నాయకుడు టంగుటూరు నరసింహారెడ్డి తదితరులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం.డి. షకీల్, గోవింద నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. పవన్, జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్, పార్టీ నాయకులు మహ్మద్ హుస్సేన్, ప్రసాద్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు..












