ఏలూరు, 15 September
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో మృతి చెందారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి గుండెపోటుతో కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం ఏలూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో మృతి చెందారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆరోగ్యశాఖ మంత్రిగానూ సేవలందించారు. ఆళ్ల నాని మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన మృతితో ఏలూరు రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.












