ఆదిలాబాద్, 14 September
నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు కృషితో 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఎన్హెచ్-44 నుంచి మేడిపల్లి వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.3.50 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయింది.
*మేడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. నేతలకు పాలాభిషేకం* నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు గారి ప్రత్యేక కృషితో గ్రామంలో 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో పాటు ఎన్హెచ్-44 నుంచి మేడిపల్లి వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.3కోట్ల50 లక్షలతో టెండర్ ప్రక్రియ పూర్తైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ గారు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు గారీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మేడిపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చూపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావు గారికి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులతో గ్రామానికి మరింత అభివృద్ధి చేకూరనుందని గ్రామ నాయకులు పేర్కొన్నారు.












