బొమ్మలరామారం, 13 September
ఆలేరు నియోజకవర్గంలోని 391 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి () చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అందజేశారు. యాదగిరిగుట్టలోని తన కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.
*391 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.* పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి* కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 391 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను బీర్ల అయిలయ్య గారు అందజేశారు. ఈ సందర్భంగా మండలాల వారీగా చెక్కుల వివరాలు ఇలా ఉన్నాయి: - మండలం – 60 చెక్కులు - తుర్కపల్లి మండలం – 30 చెక్కులు - రాజాపేట మండలం – 33 చెక్కులు - యాదగిరిగుట్ట మండలం – 82 చెక్కులు - మోటకొండూరు మండలం – 33 చెక్కులు - ఆలేరు మండలం – 39 చెక్కులు - ఆత్మకూరు మండలం – 44 చెక్కులు - గుండాల మండలం – 33 చెక్కులు - హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు – 37 చెక్కులు ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు CMRF ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ వారి కష్టాల్లో తోడుగా ఉంటోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతోందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. CMRF చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించడం వల్ల ఎంతో ఊరట లభించిందని పేర్కొన్నారు.


