హెల్మెట్ ధరించిన వినాయకుడు రోడ్డు భద్రతపై కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి కామారెడ్డి: వినాయక చవితి కామారెడ్డి పోలీసులు వినూత్న రీతిలో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కుటుంబ సభ్యుల కోసం సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి అనే సందేశంతో కామారెడ్డి పోలీసులు చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంటోంది.
హెల్మెట్ ధరించిన వినాయకుడుని సందర్శించిన
Share:

సారాంశం
ఎస్పీ రాజేష్ చంద్ర
ముఖ్య విషయాలు
- హెల్మెట్ ధరించిన వినాయకుడు రోడ్డు భద్రతపై కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన హెల్మెట్ ధరించండి..
- ప్రాణాలను కాపాడుకోండి కామారెడ్డి: వినాయక చవితి కామారెడ్డి పోలీసులు వినూత్న రీతిలో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
- ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
- ఈ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3626ఆర్టికల్స్
4,51,045వ్యూస్










