జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు షాపింగ్ మాల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. పట్టణంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
పట్టణంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని, ప్రజల భద్రతకు కూడా ఆటంకం కలుగుతోందని టౌన్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, పట్టణంలోని పలు ప్రముఖ షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు అందజేశారు. కిషన్ షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, మాంగల్య షాపింగ్ మాల్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఆనంద్ షాపింగ్ మాల్ వంటి షాపింగ్ మాల్స్ యాజమాన్యాలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. మాల్స్ వద్ద వాహనాల పార్కింగ్, రాకపోకలను క్రమబద్ధీకరించాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులు సూచించారు. మాల్స్ లోపల, వెలుపల భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని, సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచనలు అందాయి. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ పోలీసుల ప్రథమ కర్తవ్యమని తెలిపారు.












