సోమాజిగూడ, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ నుంచి కేకే, నవీన్ మిట్టల్‌ను తొలగించాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం 30 పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీవో 97 రద్దు చేయాల్సిందే హై లెవల్ కమిటీ నుంచి కేకే, నవీన్ మిట్టల్‌ను తొలగించాలి అసెంబ్లీలో జీవో 97పై చర్చించాలి: పాలిటెక్నిక్ జేఏసీ హైదరాబాద్, సెప్టెంబరు 7: జీవో 97ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీ నుంచి కేకే, నవీన్ మిట్టల్‌ను తొలగించాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం 30 పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 97పై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. విద్యార్థులను చర్చలకు పిలిచి, వారు లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా బెదిరించడం సరికాదని జగన్‌తో పాటు జేఏసీ నాయకులు జనార్దన్, అక్షయ్, విశాల్ అన్నారు. జీవో 97పై మంత్రి వివేక్, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి, కమిటీ చైర్మన్ కేకే వేర్వేరు విధాలుగా మాట్లాడుతున్నారని, దీనివల్ల విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యకు నష్టం కలిగించిన నవీన్ మిట్టల్‌ను కమిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జీవో 97పై శాసనసభలో చర్చించాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు జీవోను రద్దు చేయాలని కోరారు. కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని అన్నారు. జీవో 97ను రద్దు చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాల్ విక్కి, సిరి, ప్రణిత, అమూల్య, కీర్తన, జ్ఞానదీప్, ధీరజ్, పరమేష్, రాబిన్, సాత్వికతో పాటు 70 మందికి పైగా పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.












