బాసర, 8 September
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానకరమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించడంతో పాటు 24 గంటల్లోగా పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
దళిత స్పీకర్ తల్లిని దూషించడం సిగ్గుచేటు.. ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానకరమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించడంతో పాటు 24 గంటల్లోగా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మమ్మాయి రమేష్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












