దూస్గాం గ్రామంలో ఎస్సీ మాదిగ కులస్తులను కులం పేరుతో దూషించిన కేసులో నిందితులకు ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. 63 కుటుంబాలను బహిష్కరించి, మాదిగ కుక్కలు అని దూషించిన ఘటనపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు శిక్ష పడింది.
జిల్లా: దూస్గాం గ్రామంలో ఎస్సీ మాదిగ కులస్తులను కులం పేరుతో దూషించిన కేసులో నిందితులకు గౌరవ న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటనకు సంబంధించి 28.8.2021న ఫిర్యాదుదారుడు గర్క సురేష్ పోలీస్ స్టేషన్కు వచ్చి, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దకాపు, గ్రామ పెద్దమనుషులు కలిసి గ్రామంలోని 63 ఎస్సీ మాదిగ కుటుంబాలను బహిష్కరిస్తూ, మాదిగ కుక్కలు అని కులం పేరుతో దూషిస్తూ తమను హింసిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 179/2021గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో దూస్గాం గ్రామానికి చెందిన నిందితులు 1 మంద లక్ష్మణ్ (మున్నూరు కాపు), 3 మందమోహన్, 4 మంద రాజయ్య, 5 శివాయోల్ల శివ రెడ్డి, 6 గంగారెడ్డి నేరానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాల ద్వారా నిరూపించబడింది.
న్యాయస్థానం తీర్పు వివరాలు
ఈ కేసులో స్పెషల్ ఎస్సీ నంబర్ 81/2021లో, 4.11.2026 తేదీన లోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం న్యాయమూర్తి శ్రీ ఎస్. నారాయణ బహిరంగ న్యాయస్థానంలో తీర్పు వెల్లడించారు. సెక్షన్ 3(1)()() / ప్రకారం, నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5,000/- రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
కేసు దర్యాప్తు మరియు వాదనలు
కేసులో కృషి చేసిన అధికారులు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఆర్. దయాకర్ గౌడ్ వాదనలు వినిపించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన అధికారి . ఆంజనేయులు కాగా, కేసు దర్యాప్తు నిర్వహించి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేసిన అధికారి అప్పటి . వెంకటేశ్వర్. కేసు విచారణలో సమన్వయం చేసిన డిచ్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎండి. ఆరిఫ్, కోర్టు లైసెన్ అధికారి శ్రీ టి. గోవింద్, మరియు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ పి. ప్రశాంత్, కానిస్టేబుల్స్ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారు.
పోలీస్ అధికారుల అభినందన
ఈ కేసులో నిందితులకు శిక్షపడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను సమర్పించడంలో కృషిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని గౌరవనీయులు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్. ప్రత్యేకంగా అభినందించారు. కులం పేరుతో దూషించి నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.












