సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని, నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా చేపట్టారు.
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య మాట్లాడుతూ, భారతదేశ ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.
దేశ సమగ్రతకు పటేల్ సేవలు
భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో, దేశ సమగ్రత (ఐక్యత) కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా, భారతదేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారని, ఆయనకు ఉక్కుమనిషి అనే పేరు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ ఐక్యత ప్రాముఖ్యతను చాటిచెప్పారు.
అధికారుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్, ఎ. ఓ శ్రీమతి ఆసియా బేగం, నిజామాబాద్ ఐటీ, సి.సి.ఆర్.బి. ఏసీపీలు శ్రీ ప్రకాష్, శ్రీ ఆర్. నరేందర్, శ్రీ గురు నాయుడు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, సి.ఐ.లు, ఎస్.ఐ.లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎ.ఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డుల సిబ్బంది పాల్గొన్నారు.












