సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని, నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా చేపట్టారు.
కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యతకు, ఐక్యతకు సర్దార్ వల్లబాయ్ పటేల్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
భారతదేశ సమగ్రతకు పటేల్ సేవలు
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ, భారతదేశ ఉక్కుమనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ ను జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో మరియు దేశ సమగ్రత (ఐక్యత) కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా, భారతదేశంలో గల సంస్థానాలన్నింటినీ విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను ఉక్కు మనిషి అని పిలుస్తారని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్, ఎ. ఓ శ్రీమతి ఆసియా భేగం, నిజామాబాద్, ఐటీ, సి.సి.ఆర్.బి ఎ.సి.పిలు శ్రీ ప్రకాష్, శ్రీ ఆర్. నరేందర్, శ్రీ గురు నాయుడు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, సి.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎ.ఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.

