భైంసా పట్టణంలోని పురాణబజార్, భవానీ చౌక్ వద్ద నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన హారతి కార్యక్రమాల్లో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యుత్, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జనోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉత్సవాల్లో పాల్గొని అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు బబ్రూ మహారాజ్, బీఆర్ఎస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి విలాస్ గాదేవార్, మున్సిపల్ చైర్మన్ తుమ్మోల దతాత్రి, దుర్గామాత మండపం నిర్వాహకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
భైంసాలో నిమజ్జనోత్సవాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
Share:

సారాంశం
భైంసా పట్టణంలోని పురాణబజార్, భవానీ చౌక్ వద్ద నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన హారతి కార్యక్రమాల్లో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- ఈ సందర్భంగా నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.
- విద్యుత్, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
- ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జనోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
- భైంసా పట్టణంలోని పురాణబజార్, భవానీ చౌక్ వద్ద నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన హారతి కార్యక్రమాల్లో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,757వ్యూస్









