దసరా పండుగను పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ప్రధాన వీధుల్లో ఊరేగించారు.
ఆలయ ధర్మకర్త దేశ్పాండే దిగంబరరావు, పూజారి రాజాభావు శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు బుధవారం తెల్లవారుజామున 1.10 గంటల వరకు వైభవంగా కొనసాగింది.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య సాగిన ఊరేగింపుతో లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
దసరా సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలు భక్తిభావానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు.











