విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని నిర్మల్ జిల్లా మండలంలోని జామ్ సర్పంచ్ కరిపే రవళి విలాస్ తెలిపారు. ధర్మం, సత్యం, న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే సందేశాన్ని ఇది అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే రావణ దహనం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ సర్పంచ్ కరిపే రవళి విలాస్ తెలిపారు.
రావణ దహనం ధర్మం, సత్యం, న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే గొప్ప సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. రావణాసురుడు ఎంతటి శక్తివంతుడైనా, అహంకారం, అధర్మం కారణంగా పరాజయం పాలయ్యాడని, ప్రతి ఒక్కరూ చెడును విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని సూచించారు.
ఈ విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, హిందూ వాహిని కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











