బోధన్ పట్టణంలోని ఏకచక్ర శివాలయంలో నిర్వహించిన దుర్గామాత పూజా కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని భోజనశాలను పరిశీలించారు. భోజనశాలలో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆయన, ఆలయ కమిటీ సభ్యులకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.











