నిర్మల్ జిల్లా మండలంలోని ప్రసిద్ధ అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో గంగ నీళ్ల జాతర శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆభరణాలను బాజాభజంత్రీల నడుమ భక్తులు, సేవాదారులు కాలినడకన న్యూసాంగ్వి గ్రామానికి తీసుకెళ్లారు.
జాతరలో భాగంగా ఆలయం నుంచి అమ్మవారి ఆభరణాలను సేవాదారులు, భక్తులు బాజాభజంత్రీల నడుమ కాలినడకన న్యూసాంగ్వి గ్రామానికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకుడు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి భూమయ్య, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్ గౌడ్ అమ్మవారి ఆభరణాలకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం ఆభరణాలతో కొంతదూరం వెళ్లి గోదావరి నదికి సాగనంపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు దండు సాయన్న, కునేరు భూమన్నతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, అమ్మవారి భక్తులు, దీక్షాస్వాములు పాల్గొన్నారు.











