మండలంలోని జవల కే గ్రామానికి చెందిన భూమన్న భార్య సుగుణబాయి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి, సుగుణబాయి కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, సుగుణబాయి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ భాయ్ రాజన్న, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈరేష్, మాజీ సర్పంచ్ ఘని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీరాజీ, స్థానిక నాయకులు ఆత్మ రామ్, సాయినాథ్, రాజారాం, నాగోబా, లింగాజీ, మారోతి తదితరులు పాల్గొన్నారు.












