భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అగౌరవంగా రచించిన పుస్తకాన్ని రద్దు చేయాలని, రచయితపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా మండలం కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా మండలం కేంద్రంలోని దళిత సంఘాల నాయకులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఒక పిటిషన్ను అందజేశారు. హమారా ప్రసాద్ రచించిన కల్పిత నాయకుడు (ఫ్యాబ్రికేటెడ్ లీడర్) అనే పుస్తకంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు, అగౌరవకరమైన విమర్శలు దేశానికి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, పుస్తకాన్ని రద్దు చేయాలని దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఈశ్వర్, కే లక్ష్మన్న, ఎం రాజశేఖర్, రమేష్, ముత్యం దత్తు, మనోహర్, వికాస్, సుధాకర్, రాజు, రిషి తదితరులు పాల్గొన్నారు.











