ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు పేదలకు వరం లాంటివని యాద్గార్ పల్లి సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలం యాద్గార్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో పోలోజు ప్రసాద్‌కు రూ.1,43,500, యడ్ల వెంకటేశ్వర్లుకు రూ.1,08,000, పెంటమళ్ళ విజయ్ చందర్‌కు రూ.56,000, దుండిగాల నాగలక్ష్మికి రూ.51,000, మల్లె బోయిన లక్ష్మికి రూ.26,000, ఎడ్ల లక్ష్మమ్మకు రూ.23,000, అప్పన బోయిన సుందరయ్యకు రూ.18,000 చొప్పున, మొత్తం ఏడుగురు లబ్ధిదారులకు రూ.4,25,500 విలువైన చెక్కులను సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యులతో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











