తానూర్, 20 October
నిర్మల్ జిల్లా మండలంలోని తొండాల గ్రామంలో 70వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు నివాళులర్పించి, పంచశీల జెండాను ఆవిష్కరించారు.
నిర్మల్ జిల్లా మండలంలోని తొండాల గ్రామంలో 70వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవ్ మెరేకర్ మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన త్యాగాలు, సామాజిక సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హెగ్డేకర్ లక్ష్మన్న, లోఖండే గంగాధర్, సచిన్ వాఘామరే, గౌతమ్ వాఘామరే, మదన్ లోఖండే, పాండురంగ్ మెరేకర్, లాలు తదితరులు పాల్గొన్నారు.











